Sunday, August 17, 2014

నాకోసం చరిత్రలు రాయక్కర లేదు....!!

నాకోసం చరిత్రలు రాయక్కర లేదు....!!

నాయకులంతా వేదిక లెక్కి ఉపన్యాసాలిస్తుంటే
దారులు నడిచి, ఎండన ఎండి, వానకు జడవక
వందేమాతర నినాదం గుండెల నింపుకొని

తెల్ల వాడి లాఠిలకు,తూటాల గాయాలకు,
అహింసా ఖధ్దర్లద్దుకుంటూ

వందేమాతరమన్నది నా నెత్తురోడిన శరీరం!!

చుట్టూ సలామ్ చెస్తే, చేర వచ్చే విలాసాలెన్నొ...
బూట్లు తుడిస్తే వచ్చే భుస్వామ్యం ఎంతో.....
తోటి వారంతా 'తెలివిన' పడుతుంటే....

కన్న వారిని వారి ప్రాప్తానికి వదిలెసి,
కట్టుకున్న వారిని దారిద్ర్యానికి బలి చేసి
అస్ప్రుశ్యపు గోడలు కూలదొస్తూ,
పలుగు రాయినై పరితపించా, జాతీయోద్యమ జ్యాల కై,

వందేమాతరమంటూ అహుతులిచ్చుకున్నా నా ఆశల సౌధాల సమిధల్ని!!

(ఆ (అ)సామాన్యుల ఉద్యమ స్పూర్తికి జోహార్ల తో.........) 15AUG